అది ఏ గ్రాహం నుండి వచ్చింది? Could Life on Earth Be Aliens? Exploring Panspermia
పాలపుంతలో ఎంతమంది సూర్యులు ఉంటారో తెలుసా అక్షరాల 100 నుండి 400 బిలియన్ ప్రతి 10 సూర్యులకి ఒక సూర్యుడు చుట్టూ ఒక భూమి లాంటి గ్రహం ఉంది అనుకున్న మన పాలపుంతలో జీవానికి అనువైన గ్రహాలు కోట్లల్లో ఉంటాయి ఇలా చూసుకుంటే విశ్వంలో ఇంకెన్ని భూమి లాంటి గ్రహాలు ఉండాలి అసలు విశ్వంలో మొదటి జీవం భూమి మీద పుట్టింది అన్న గ్యారెంటీ ఏంటి ఒకవేళ అది వేరే గ్రహం మీద పుట్టుంటే భూమి మీదకు ఎలా వచ్చింది ఏముంది గ్రీన్ ఏలియన్స్ యుఎఫ్ ఓర్స్ వేసుకొని భూమికి జీవాన్ని తెచ్చి ఉండొచ్చు అయితే సైన్స్ నుండి ఫిక్షన్ కి వెళ్లే ముందు సైన్స్ ఏం
చెప్తుందో చూద్దాం ఇక్కడ పాన్ స్పెర్మియా అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి కానీ అదేంటో తెలుసుకునే ముందు 450 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లి భూమి ఎలా ఉందో చూడాలి ఆ సమయాన్ని హేడియన్ ఇయాన్ అంటారు ఈ టైం పీరియడ్ లో భూమి ఒక మండే అగ్నిగోళంలా ఉంది కారణం ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ భూమిని ఆపకుండా గుద్దుతూనే ఉన్నాయి కానీ 22 కోట్ల సంవత్సరాల తర్వాత మ్యాజికల్ గా జీవం పుట్టింది జీవం అంటే ఏంటో వింత పదార్థంతో తయారయ్యి ఉంటుంది అనుకోకండి ఇప్పటివరకు మనం గుర్తించిన ప్రతి జీవంలో ఎక్కువ శాతం కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫాస్ఫరస్ మరియు సల్ఫర్ ఉంటాయి
వీటికి జీవం ఉండదు కానీ అన్ని కలిసి మొదటి జీవాన్ని పుట్టించాయి అది పెద్దగా ఉండదు చిన్న చిన్న బ్యాక్టీరియా రూపంలో మైక్రోస్కోప్ కింద మాత్రమే కనిపించేటట్టుగా పుట్టాయి ఇలా జీవం లేని కెమికల్ నుండి జీవం పుట్టడానికి 22 కోట్ల సంవత్సరాలు సరిపోదు అని అనేక రీసెర్చ్ లు చెప్తున్నాయి అయితే హేడియా నియాన్ లో అంతరిక్ష రాళ్లు భూమిని గుద్దాయి అని మాట్లాడుకున్నాం కదా వేరే గ్రహంలో పుట్టిన సూక్ష్మ జీవులు ఈ రాళ్ల లోపల దాక్కొని భూమి మీదకు వచ్చి ఉండొచ్చు ఈ ప్రాసెస్ ని పాన్స్పెర్మియా అంటారు అయితే ఒక జీవి పాన్స్పెర్మియా ద్వారా ఒక గ్రహం నుండి
Could Life on Earth Be Aliens
ఇంకో గ్రహానికి ట్రావెల్ చేయాలంటే మూడు స్టేజెస్ దాటాలి మొదటి స్టేజ్ లో ఆ జీవి తన గ్రహం నుండి ఎస్కేప్ అయ్యి అంతరిక్షంలోకి రావాలి సెకండ్ స్టేజ్ లో అది అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకోవాలి మూడవ స్టేజ్ లో ఆ జీవి కొత్త గ్రహం మీద పడాలి అయితే ఆ జీవి స్టేజ్ వన్ ని ఎలా పూర్తి చేసింది రాకెట్స్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళడానికే మనమంత కష్టపడుతుంటే అసలు తెలివే లేని సూక్ష్మజీవి అంతరిక్షంలోకి ఎలా వెళ్తుంది గాలిలో కూడా బ్యాక్టీరియా బతకగలదు అని మీకు తెలుసు సూర్యుడి నుండి వచ్చిన వేడి గాలిని వేడి చేస్తుంది వేడి
గాలి పైకి వెళ్ళడానికి చూస్తుంది సో ఇలా పైకి వెళ్ళిన సూక్ష్మ జీవి ఆ గ్రహం యొక్క చివరి వాతావరణ లేయర్ ని దాటుకొని అంతరిక్షంలోకి అడుగు పెడతాయి దీన్ని రేడియో పాన్స్పెర్మియా అంటారు అయితే ఈ పద్ధతి అతి సూక్ష్మంగా ఉన్న సింగిల్ సెల్ అంటే ఒక్క కణం మాత్రమే ఉన్న జీవులకి పనిచేస్తుంది కానీ అనేక కణాలు ఉన్న జీవి ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటాయి సో వేడి గాలి ద్వారా అవి అంతరిక్షంలోకి వెళ్లడం కష్టం కానీ ప్రతి అంతరిక్ష వస్తువుకి ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది ఎస్కేప్ వెలాసిటీ అంటే అంతరిక్ష వస్తువు గ్రావిటీని తప్పించుకొని వెళ్ళడానికి కావలసిన స్పీడ్ ఇలా చూసుకుంటే
భూమి ఎస్కేప్ వెలాసిటీ ఒక సెకండ్ కి 112 km వస్తుంది అంటే ఒక సెకండ్ కి 11.2 km కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్తే కానీ భూమి గ్రావిటీని తప్పించుకోలేము అయితే విశ్వం మనకంటే తెలివైంది పెద్ద పెద్ద అంతరిక్ష రాళ్లు వచ్చి గ్రహాలను గుద్దినప్పుడు అవి పేలిపోయినప్పుడు వచ్చిన చెత్త అంతా చాలా వేగంగా పైకి లేస్తుంది ఈ చెత్త పైకి లేచే స్పీడ్ ఆ గ్రహం యొక్క ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంటే అది అంతరిక్షంలోకి ఎస్కేప్ అయిపోతుంది ఈ మెకానిజం ని లితో పాన్స్పెర్మియా అంటారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి ఇలాంటి పెద్ద పేలులలో డైనోసర్స్
లాంటి జీవాలే అంతమైపోయినప్పుడు అతి చిన్న సూక్ష్మ జీవులు ఎలా బతికుంటాయి అని హలో ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు అంతరిక్షంలోకి ఎస్కేప్ అయ్యే జీవులు ఎలాంటి ఫోర్సెస్ ని తట్టుకోవాలో కనిపెట్టారు దాని ప్రకారం ఆ జీవులు 550000 అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే భూమి మీద సముద్రమట్టంలో ఉండే ప్రెజర్ కంటే 550000 రెట్ల ఎక్కువ ప్రెజర్ మూడు లక్షల జి ఫోర్స్ అంటే ఒక ఫైటర్ జెట్ పైలట్ మీద పడే ఒత్తిడి కంటే 33 వేల రెట్ల ఎక్కువ
ఒత్తిడి మరియు 1000 డిగ్రీల వేడిని తట్టుకోవాలి ఇంత విన్న తర్వాత ఏ జీవి కూడా పైన చెప్పిన దారుణాల్ని తట్టుకోలేవు అని మీకు అనిపిస్తుందేమో ఇక్కడే ఒక ట్విస్ట్ సైంటిస్టులు ఊరకనే ఉండకుండా దారుణమైన స్పీడ్స్ తో సూక్ష్మ జీవుల్ని గోడల మీద మీదకి షూట్ చేశారు అలానే తట్టుకోలేని ప్రెజర్స్ తో మెటల్ ప్లేట్స్ మధ్య కుక్కి సెంట్రిఫ్యూగ్ అనే పరికరాలు తిప్పి తిప్పి వదిలిపెట్టారు ఆశ్చర్యకరంగా కొన్ని సూక్ష్మ జీవులు ఈ కండిషన్స్ ని కూడా తట్టుకొని బతికున్నాయి సరే ఆ జీవులు పుట్టిన గ్రహాన్ని వదిలేసి అంతరిక్షంలోకి వచ్చాయి అనుకుందాం ఇక్కడే అసలు కథ
స్టార్ట్ అవుతుంది అవి ఇంకో గ్రహానికి వెళ్తే కానీ భవిష్యత్తు తరాలను పుట్టించగలవు కానీ వేరే గ్రహానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సో కొన్ని లక్షలు లేదా కోట్ల సంవత్సరం సంవత్సరాల పాటు అవి ఎలా బతికుంటాయి బతికుండాలి తప్పదు దానికి ఎగ్జాంపులే టార్డిగ్రేడ్ అనే సూక్ష్మ జీవులు వీటిని స్పేస్ లోని చల్లటి పొడి వాక్యూమ్ కండిషన్స్ లో పెట్టిన బతికున్నాయి కానీ అంతరిక్షంలోని అల్ట్రా వైలెట్ కిరణాలు ఏ సూక్ష్మ జీవిని వదిలిపెట్టదు అదొక శానిటైజర్ లా అన్నిటిని కాల్చేస్తుంది కానీ ఎవల్యూషన్ జీవానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది దాన్ని సూక్ష్మ జీవులు
బాగా ఉపయోగించుకొని ఒక రకమైన నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయి చచ్చిపోయినట్టుగా బిగుసుకుపోయింది అవుతాయి దీన్నే క్రిప్టోబయోసిస్ అంటారు అయితే రేడియో పాన్స్పెర్మియాలో సూర్యుడు అల్ట్రా వైలెట్ కిరణాల ద్వారా గాలి వేడెక్కి సూక్ష్మ జీవులు పైకి వెళ్తాయి అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మరి ఇక్కడ సూక్ష్మ జీవులు ఎందుకు చనిపోవు దీనికి కూడా ఒక స్టోరీ ఉంది మన సోలార్ సిస్టం చుట్టూ అనేక తోక చుక్కలు అంటే కామెట్స్ ఉంటాయి వీటిల్లో ఐస్ ఉంటుంది ఇలా ఇతర సోలార్ సిస్టమ్స్ లో ఉండే కామెట్స్ వాటి గ్రహాల దగ్గరికి వచ్చినప్పుడు వాతావరణ పై లేయర్స్
లో ఉన్న సూక్ష్మ జీవులు కామెట్స్ కి అతుక్కుంటాయి ఇలా ఇవి కామెట్స్ తో పాటు అంతరిక్షంలో ట్రావెల్ చేసి వేరే గ్రహాలకు వెళ్తాయి ఇప్పుడు ఈ సూక్ష్మ జీవులు రాయి పైన కాకుండా లోపల ఉంటూ ట్రావెల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం దీన్ని లితో పాన్స్పెర్మియా అంటారు రాయి లోపల ఫుడ్ ఉండదు కదా అవి ఎక్కువ రోజులు బతకవులే అని మీరు అనుకోవచ్చు కానీ ఒక 250 మిలియన్ సంవత్సరాల పురాతన సాల్ట్ క్రిస్టల్ లో బాసిలస్ అనే బ్రతికున్న బ్యాక్టీరియాని కనిపెట్టాం ఇలాంటి సూక్ష్మ జీవులు రాళ్లలో ఉన్న ఖనిజాల్ని ఉపయోగించుకొని బతుకుతాయి అయితే రాళ్ల లోపల ఉంటే యువీ కిరణాల నుండి
కూడా తప్పించుకోవచ్చు వేడి ఉంటేనే జీవం ఉంటుంది కానీ ఒక రాయి లోపల వేడి ఎలా పుడుతుంది కామెట్స్ మధ్య ఉండే కోర్లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి ఇవి డికే అవుతూ వేడిని వదులుతాయి ఈ వేడి ప్లస్ కరిగిన నీరు సూక్ష్మ జీవులు బతకడానికి కావలసిన వాతావరణాన్ని తయారు చేస్తుంది అందుకే మన సోలార్ సిస్టం లోని కామిట్స్ మీద ఏమైనా జీవం ఉందేమో అని రీసెర్చ్ చేస్తాం ఈ రీసెర్చ్ లో భాగంగా కామెట్ 67p మీదకి రోజెట్టా అనే మిషన్ ని పంపాం దాని మీద సేకరించిన శాంపిల్స్ ద్వారా జీవానికి సంబంధించిన ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయని కనిపెట్టాం సరే ఈ సూక్ష్మ జీవులు ఉన్న
రాయి ఒక గ్రహం దగ్గరికి వచ్చింది అనుకుందాం మరి అవి గ్రహం మీదకి ఎలా వెళ్తాయి ఏముంది ఆ రాయి గ్రహాన్ని గుద్దాలి గుద్దే క్రమంలో వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ రాయి మీద పడే ఒత్తిడి వేడి వర్ణనాతీతం అయితే ఈ వేడిని తట్టుకొని సూక్ష్మ జీవులు బతికి ఉండగలవా లేవా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు బ్యాక్టీరియం బి సెప్టిల్లస్ యొక్క స్పోర్స్ అంటే గుడ్డు లాంటి వస్తువుల్ని గ్రానైట్ డోమ్స్ లో పెట్టి ఒక రాకెట్ తో 120 km ఎత్తుకు లాంచ్ చేశారు అయితే వేడి వల్ల గ్రానైట్ డోమ్ బయట ఉన్న స్పోర్స్ చనిపోయాయి కానీ లోపల ఉన్న
కొన్ని బతికే ఉన్నాయి ఇలా ఒక అంతరిక్ష రాయి గ్రహాన్ని గుద్ది వేరే గ్రహం నుండి ఈ గ్రహానికి జీవాన్ని తరలించే ప్రాసెస్ అయింది పాన్స్పెర్మియాని పూర్తి చేస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే స్వయంగా ఏలియన్స్ ఏ వచ్చి భూమి మీద జీవానికి పునాది పోశారు అని నోబెల్ ప్రైజ్ గెలిచిన ఫ్రాన్సిస్ క్రిక్ మరియు లెస్లీ ఆర్గెల్ పేర్కొన్నారు దీన్ని డైరెక్ట్ పాన్స్పెర్మియా అంటారు ప్రోమితియస్ సినిమా స్టార్టింగ్ సీన్ లో ఈ డైరెక్ట్ పాన్ స్పెర్మియా ద్వారా భూమి మీద జీవాన్ని పుట్టించే విధానాన్ని చాలా యూనిక్ గా చూపించారు!